Allu Arjun: 'పుష్ప' కోసం సుకుమార్ అలా ప్లాన్ చేశాడట!

Pushpa movie update
  • రెండు భాగాలుగా 'పుష్ప'
  • ఫస్టు పార్టు 80 శాతం పూర్తి
  • సంగీత దర్శకుడిగా దేవీశ్రీ  
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రూపొందుతోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. అడవి నేపథ్యంలో ఎర్రచందనం అక్రమరవాణా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ .. ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా కరోనా తీవ్రత పెరిగింది. దాంతో షూటింగును ఆపేశారు. అదే పరిస్థితి ఇప్పటివరకూ సాగుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో, మధ్యలో షూటింగు ఆపుకున్న వాళ్లంతా సెట్స్ పైకి వెళుతున్నారు. అలా సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లడానికి సుకుమార్ రెడీ అవుతున్నట్టుగా చెబుతున్నారు. 'పుష్ప'ను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి చెందిన షూటింగును 80 శాతం వరకూ పూర్తిచేశారట. సింగిల్ షెడ్యూల్ ను ప్లాన్ చేసి, జూలైలో షూటింగును పూర్తిచేయాలనే ఉద్దేశంతో సుకుమార్ ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
Allu Arjun
Rashmika Mandanna
Fahad Fassil

More Telugu News