Atchannaidu: వీరంతా ఏ కారణాలతో చనిపోయారో అంతా మిస్టరీ: అచ్చెన్నాయుడు

Atchannaidu slams AP govt on corona deaths facts
  • సర్కారు తీరుపై విమర్శలు
  • మేలో 2,938 చనిపోయారని ప్రభుత్వం చెబుతోందన్న అచ్చెన్న
  • రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం లక్షకు పైగా మరణాలని వెల్లడి
  • మరణాలపై సందేహం వ్యక్తం చేసిన వైనం
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఏడాది మే నెలలో 2,938 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాలు పరిశీలిస్తే మే నెలలో 1,03,745 మంది చనిపోయినట్టు వెల్లడవుతోందని అచ్చెన్నాయుడు తెలిపారు.  2018, 2019 సంవత్సరాల మే నెలల్లో గరిష్ఠంగా నమోదైన 27,100 మరణాలు, సర్కారు చెబుతున్న 2,938 కరోనా మరణాలు తీసేస్తే... దాదాపు 70 వేల మంది ఒక్క ఏపీలోనే చనిపోయారని వివరించారు. అయితే, వీరంతా ఏ కారణాలతో చనిపోయారో అంతా మిస్టరీ అని పేర్కొన్నారు.
Atchannaidu
Deaths
Corona Virus
Andhra Pradesh

More Telugu News