Srinu Vaitla: అదే నేను చేసిన పొరపాటు: శ్రీను వైట్ల

Srinu Vaitla says about his mistakes
  • శ్రీను వైట్లకి మంచి క్రేజ్
  • వరుస బ్లాక్ బస్టర్లు
  • ఆ తరువాత పరాజయాలు
  • తగ్గిన అవకాశాలు  
తెలుగు తెరపై దర్శకుడిగా శ్రీను వైట్ల తనదైన మార్కు వేశారు. ఆయన సినిమాల్లో యాక్షన్ .. ఎమోషన్ ఉంటాయి. వాటిని నడిపించే తీరు చాలా సరదాగా ఉంటుంది. మొదటి నుంచి చివరివరకూ కామెడీని కలుపుకునే ఆయన కథలు నడుస్తాయి. కొంతకాలం క్రితం వరకూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితాలోనే ఆయన పేరు కనిపిస్తూ వచ్చింది. కానీ వరుస పరాజయాల కారణంగా ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఆయన మార్కు సినిమాలను ఇష్టపడే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఆయన నుంచి సినిమాలను వారు కోరుకుంటూనే ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను వినోదప్రధానమైన సినిమాలనే చేస్తూ వెళ్లాను. నా సినిమాలు ఒకే రకంగా ఉంటున్నాయనే టాక్ రావడంతో, కొత్తగా చేయాలనే ఉద్దేశంతో రూట్ మార్చాను. కానీ శ్రీను వైట్ల సినిమాలు ఇలాగే ఉండాలని కోరుకున్న ప్రేక్షకులకు, నేను నా స్టైల్ ను మార్చుకోవడం నచ్చలేదు. అందువల్లనే ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. నా స్టైల్ సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతున్న సమయంలో, కొత్తదనం కోసం ట్రై చేయడమే నేను చేసిన పొరపాటు .. ఇకపై అలా జరగదు" అని చెప్పుకొచ్చారు. మంచు విష్ణు హీరోగా ఆయన 'డి అండ్ డి' చేయనున్న సంగతి తెలిసిందే.  
Srinu Vaitla
Manchu Vishnu
D&D Movie

More Telugu News