Birth Day: బర్త్ డే పార్టీలో చిందులేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. పోలీసుల అదుపులో యువతీయువకులు!

Police arrest 67 persons in a Birth Day Party in Hyderabad
  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఘటన
  • రేవ్ పార్టీని మించిపోయిన బర్త్ డే సెలబ్రేషన్స్
  • 67 మంది యువతీ యువకుల అరెస్ట్ 
  • పరారీలో ప్రధాన నిందితుడు
కరోనా వేళ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరుణ్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన 70 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం తాగుతూ, డీజే శబ్దాల్లో చిందులేస్తూ హోరెత్తించారు.

సమాచారం అందుకున్న కడ్తాల్ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫాం హౌస్‌పై దాడి చేసి నిర్వాహకులతోపాటు మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు కాగా, మిగతా వారిలో 21 మంది యువతులు, 43 మంది యువకులు ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ పరారయ్యాడు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన యువతీయువకులను ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పార్టీ వీడియోలు రేవ్ పార్టీకి మించిపోయి ఉండడం గమనార్హం.
Birth Day
Rave Party
Hyderabad
Ranga Reddy District

More Telugu News