YS Sharmila: నేనూ రైతునే అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కు వీరి బాధలు పట్టవా?: షర్మిల

YS Sharmila questions CM KCR behalf of farmers
  • తెలంగాణలో ప్రజా సమస్యలపై గళం విప్పిన షర్మిల
  • విమర్శల్లో పదును పెంచిన వైనం
  • కేసీఆర్ లక్ష్యంగా మరోసారి వ్యాఖ్యలు
  • రైతుపై ఎందుకంత కక్ష? అని ఆగ్రహం
వైఎస్సార్ తెలంగాణ పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగప్రవేశానికి ఉరకలేస్తున్న వైఎస్ షర్మిల ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో స్పందించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక అన్నదాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు.

నేనూ రైతునే అని చెప్పుకునే కేసీఆర్ కు రాష్ట్రంలోని రైతుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష? అని నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరవాలని షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను రైతులను కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.
YS Sharmila
KCR
Farmers
Telangana
YSR Telangana Party

More Telugu News