Esha Rebba: మలయాళ సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్!

Esha Rebba got a chance in Malayalam movie
  • యూత్ లో మంచి క్రేజ్
  • తమిళంలో ప్రయత్నాలు
  • కుంచాకో బోబన్ జోడీగా ఛాన్స్
  • కీలక పాత్రలో అరవింద్ స్వామి  
తెలుగు తెరపై కథానాయికగా తెలుగు అమ్మాయి రాణించడం కష్టమే. ఎందుకంటే వివిధ భాషల్లో నుంచి ఇక్కడికి వస్తున్న గ్లామరస్ హీరోయిన్స్ ధాటిని తట్టుకుని నిలబడటం తేలికేం కాదు. అయినా ఈషా రెబ్బా తన సత్తా చాటడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతూనే ఉంది.

'రాగల 24 గంటల్లో' సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. 'అరవింద సమేత'లో మెరిసిన ఈ సుందరి, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలోను సందడి చేయనుంది. ఈ సినిమాపై ఆమె గట్టి ఆశలనే పెట్టుకుంది. తమిళంలో కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఈషా రెబ్బాకి, మలయాళం నుంచి అవకాశం రావడం విశేషం.

కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించింది. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ 'గోవా'లో మొదలు కానుంది. తాను ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు ఈషా రెబ్బా చెప్పింది. ఈ సినిమా కోసం తాను రైఫిల్ షూటింగ్ .. బాక్సింగ్ నేర్చుకుంటున్నానని అంది.
Esha Rebba
Aravind Swami
Kunchacko Boban

More Telugu News