Balakrishna: బాలయ్య దర్శకత్వంలోనే హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ?

Balakrishna son Mokshagna entry in  Tollywood
  • హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీపై టాక్
  • 'ఆదిత్య 369' సినిమాకి సీక్వెల్
  • త్వరలో అధికారిక ప్రకటన  
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని బాలయ్య అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఫలానా దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమై పోయిందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయిగానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడటం లేదు. ఇలా ఆలస్యమవుతూ ఉండటంతో, మోక్షఙ్ఞకి అసలు నటనవైపు ఇంట్రెస్ట్ లేదనే వార్తలు కూడా వచ్చాయి.  

ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందన్నది ఈ వార్త సారాంశం. గతంలో తనకి సూపర్ హిట్ ఇచ్చిన 'ఆదిత్య 369' సీక్వెల్ చేయాలనీ, ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారట. ఈ సినిమాకి తనే దర్శకత్వం వహించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఆల్రెడీ ఆ దిశగా సన్నాహాలు మొదలయ్యాయనే చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
Balakrishna
Mokshagna
Adithya 369 Sequel

More Telugu News