Andhra Pradesh: ఏపీలో నేడు ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు.. కొత్త అభ్యర్థులు వీరే!

Four MLC positions that will be vacant in AP today
  • గవర్నర్ కోటాలోని స్థానాలు ఖాళీ 
  • నలుగురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు ఫైల్
  • రేపటిలోగా గవర్నర్ నుంచి ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలోని నాలుగు స్థానాలు నేడు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. భర్తీ అయ్యే స్థానాలను మోషేను రాజు (పశ్చిమ గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి)తో భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌కు ఫైలు పంపినట్టు సమాచారం. నేడు, లేదంటే రేపటిలోగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Andhra Pradesh
MLC
AP Legislative Council
Governor

More Telugu News