Samantha: మరోసారి పవన్ తో జతకట్టనున్న సమంత?

 Pavan kalyan and Samantha combo for second time
  • గ్లామరస్ పాత్రలకి దూరంగా సమంత
  • నటన ప్రధానమైన పాత్రలవైపు మొగ్గు
  • 'శాకుంతలం'లో టైటిల్ రోల్
  • శకుంతల పాత్రపై గట్టి నమ్మకం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సమంత చాలాకాలంగా చక్రం తిప్పుతూనే ఉంది. అయితే, వివాహమైన తరువాత నుంచి ఆమె గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. నటన ప్రధానమైన పాత్రలు .. నాయిక ప్రధానమైన సినిమాలను మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది.

ఆ క్రమంలో ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమాను చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా, తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని సమంతనే చెబుతుండటం విశేషం.

ఈ సినిమా తరువాత సమంత .. పవన్ కల్యాణ్ కు జోడీగా ఒక సినిమా చేయనుందనే టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. గతంలో పవన్ - సమంత కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టు విషయంపై అధికారిక ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఇక ఖుషీ కావొచ్చు.
Samantha
Shakunthalam Movie
Pavan kalyan
Harish Shankar

More Telugu News