Corona Virus: కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ తీసుకున్నా.. డెల్టా వేరియంట్‌ సోకే అవకాశం ఉంది!

Delta variant may infect even if covaxin covishield vaccines have taken
  • ఢిల్లీ ఎయిమ్స్‌, ఎన్‌సీడీసీ వేర్వేరు అధ్యయనం
  • డెల్టా వేరియంట్‌కు సాంక్రమణ శక్తి అధికం
  • 63 మంది కరోనా బాధితులపై  అధ్యయనం
  • ఒకే డోసు తీసుకున్న వారిలో 76.9 శాతం ఇన్‌ఫెక్షన్‌ రేటు
  • రెండు డోసులు తీసుకుంటే 60 శాతం ఇన్‌ఫెక్షన్‌ రేటు
కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్‌ సోకే అవకాశం ఉందని ఎయిమ్స్‌(ఢిల్లీ), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) వేర్వేరుగా జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే తొలిసారి భారత్‌లో గుర్తించిన డెల్టా రకానికి సాంక్రమణ శక్తి 40-50 శాతం అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలపగా.. తాజాగా ఎయిమ్స్ (ఢిల్లీ) అధ్యయనం సైతం అదే విషయాన్ని వెల్లడించింది. వరుసగా ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన 63 మంది కరోనా బాధితుల వివరాల్ని అధ్యయనం చేసి ఎయిమ్స్‌-ఐజీఐబీ (ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ) ఈ విషయాలను వెల్లడించింది.  

63 మందిలో 53 మంది కొవాగ్జిన్‌ తొలి డోసు, మిగిలిన వారు కొవిషీల్డ్‌ తొలి డోసు తీసుకున్నారు. మరో 36 మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఒకే డోసు తీసుకున్న వారిలో 76.9 శాతం డెల్టా వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో 60 శాతం ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారు. ఇక ఎన్‌సీడీసీ జరిపిన అధ్యయనంలో కొవిషీల్డ్‌ తీసుకున్న 27 మందిలో 70.3 డెల్టా వేరియంట్‌ ఇన్‌ఫెక్షన్ కనిపించినట్లు తేలింది.
Corona Virus
delta variant
COVAXIN
Covishield

More Telugu News