విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ?
- షూటింగు దశలో 'పుష్ప'
- బోయపాటితో కథా చర్చలు
- గతంలో హిట్ కొట్టిన 'సరైనోడు'
- కథపై విక్రమ్ కుమార్ కసరత్తు
అయితే విక్రమ్ కుమార్ ను కూడా ఒక మంచి కథను రెడీ చేయమని అల్లు అర్జున్ చెప్పాడట. అప్పటి నుంచి విక్రమ్ కుమార్ అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. మొదటి నుంచి కూడా విక్రమ్ కుమార్ వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆయనకి చెప్పుకోదగిన హిట్లు లేవు. ప్రస్తుతం ఆయన చైతూ హీరోగా 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమా బన్నీతోనే ఉండొచ్చని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.