France: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ను చెంపపై కొట్టిన దుండగుడు!

A man slapped French pesident macron
  • దేశ పర్యటనలో ఉన్న మేక్రాన్‌
  • దారిపొడవునా ప్రజల స్వాగతం
  • ప్రజల్ని ఉత్సాహపరిచేందుకు మధ్యలో దిగిన అధ్యక్షుడు
  • చేయి కలిపినట్టే కలిపి చెంపపై కొట్టిన దుండగుడు
ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ను గుర్తు తెలియని దుండగుడు చెంపపై కొట్టడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. దేశ పర్యటనలో ఉన్న మేక్రాన్‌ మంగళవారం ఆగ్నేయ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లారు. ఆయనకు దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు మేక్రాన్‌ ఓ గ్రామంలో దిగి వారితో చేతులు కలిపేందుకు దగ్గరికి వెళ్లారు. ఇంతలో ఓ దుండగుడు షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నట్లే ఇచ్చి ఆయన చెంపపై కొట్టాడు.

వెంటనే స్పందించిన మేక్రాన్‌ భద్రతా సిబ్బంది దుండగుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ సంఘటన భద్రతా వైఫల్యాలను సూచిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడిని తెలుసుకునేందుకే తాను దేశంలో పర్యటిస్తున్నానని మేక్రాన్ గతంలో ప్రకటించారు.
France
Emmanuel Macron
Slap

More Telugu News