Bandi Sanjay: ప్రధానికి పక్క రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలుపుతుంటే కేసీఆర్ పత్తా లేకుండా పోయారు: బండి సంజయ్

Bandi Sanjay slams CM KCR for not appreciate PM Modi free vaccination announcement
  • దేశమంతా ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటించిన మోదీ
  • కేసీఆర్ ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలన్న బండి సంజయ్
  • కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
  • జులై నాటికి మరో 40 లక్షల డోసులు రావొచ్చని వెల్లడి
దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల సీఎంలు అభినందనలు తెలుపుతుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేకుండా పోయారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకటించిన ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటే కేసీఆర్ కు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణకు 80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించిందని, జులై నాటికి మరో 40 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని వివరించారు.
Bandi Sanjay
KCR
Narendra Modi
Free Vaccination
India

More Telugu News