kcr: ఎంబీసీ సిద్ధాంతకర్త కోప్రా మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

kcr condoles family of kola prasad
  • నెల్లూరు జిల్లాకు చెందిన కోప్రా
  • గత కొంతకాలంగా అనారోగ్యం
  • హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • ఆదివారం సాయంత్రం కన్నుమూత
  • కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి
ఎంబీసీ సిద్ధాంతకర్త, సామాజిక అభ్యుదయవాది, కోలపూడి ప్రసాద్ ( కోప్రా )  మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తను నమ్మిన విలువల కోసం కోప్రా అహర్నిశ‌లు పాటుపడ్డారన్నారు. ఆయన మరణంతో అత్యంత వెనకబడిన వర్గాలు తమలో ఒక గొప్ప మేధావిని కోల్పోయాయని విచారం వ్యక్తం చేశారు. కోప్రా కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోల‌పూడి ప్ర‌సాద్ నెల్లూరు జిల్లాకు చెందినవారు. గ‌త కొంత‌కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మెద‌డు ర‌క్త నాళాల్లో ర‌క్తం గ‌డ్డకట్టి ఆయన చ‌నిపోయిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. కోప్రాకు భార్య నిర్మ‌ల‌, ఒక కూతురు ఉన్నారు.
kcr
mbc
kola prasad

More Telugu News