Vineeth: వినీత్ దృష్టి ఇక తెలుగు సినిమాలపైనే!

Vineeth is intrested to do telugu films
  • వినీత్ మంచి క్లాసికల్ డాన్సర్
  • 'ప్రేమదేశం'తో విపరీతమైన క్రేజ్
  • 'రుక్మిణి' .. 'ఆరోప్రాణం' వంటి హిట్లు
  • ఇంతకాలానికి రీ ఎంట్రీ  
తెలుగులోకి అనువాద చిత్రంగా వచ్చిన 'ప్రేమదేశం' అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమాతో అబ్బాస్ - వినీత్ లకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వినీత్ మంచి క్లాసికల్ డాన్సర్ .. అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ ను చాలామంది కుర్రాళ్లు ఫాలో అయ్యారు. అలాంటి వినీత్ 'రుక్మిణి' .. 'ఆరోప్రాణం' వంటి హిట్ సినిమాలు చేశాడు. ఆ తరువాత తమిళ .. మలయాళ భాషల్లో బిజీ అయ్యాడు. అందువలన తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అబ్బాస్ న్యూజిలాండ్ లో సెటిల్ కాగా, వినీత్ మాత్రం సినిమా ఫీల్డ్ ను వదిలి పెట్టలేదు.

హీరోగా అవకాశాలు తగ్గిన తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా వినీత్ ముఖ్యమైన పాత్రలను చేస్తూనే ఉన్నాడు. ఇటీవల తెలుగులో వచ్చిన 'రంగ్ దే' సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇచ్చాడు. చాలా కాలం తరువాత తెరపై వినీత్ ను చూసిన అభిమానులు, ఆయనలో పెద్దగా మార్పురాలేదని అనుకున్నారు. ఇక వినీత్ అందుబాటులోకి రావడంతో, ముఖ్యమైన పాత్రల కోసం ఆయనను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో తెలుగు భాషపై కాస్త పట్టు సాధించి, ఇక్కడ వరుస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. రీ ఎంట్రీ ఆయనకి ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాలి మరి.
Vineeth
Premadesham
Rukmini
Rang De Movie

More Telugu News