Allu Arjun: ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా.. ప‌చ్చ‌ద‌నం కోసం అల్లు అర్జున్ వినూత్న ప్ర‌య‌త్నం!

alluarjun encourages netizens to plant trees by kicking off GoGreenWithAA
  • మొక్క‌లు నాటి షేర్ చేయండి
  • వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను
  • #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించండి
ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా సినీన‌టుడు అల్లు అర్జున్ నూతన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. త‌న ఇంటి వ‌ద్ద మొక్క నాటి అంద‌రూ నాటాల‌ని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి నీళ్లు పోస్తుండగా తీసుకున్న ఫొటోను షేర్ చేసి, అంద‌రూ మొక్క‌లు నాటి త‌న‌లాగే చేయాలని పిలుపునిచ్చాడు.
              
'మొక్క‌ల‌ను నాటుతామ‌ని, పర్యావ‌ర‌ణ హిత అల‌వాట్ల‌ను స్వీక‌రిస్తామ‌ని ఈ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తిజ్ఞ చేద్దాం. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల కోసం మ‌న‌ భూమిని ప‌చ్చ‌ద‌నానికి చిరునామాగా మార్చుదాం. ప్ర‌తి ఒక్క‌రూ ఈ చొర‌వ తీసుకోవాల‌ని కోరుతున్నాను. మొక్క‌లు నాటి షేర్ చేయండి.. వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని ర‌క్షించుకునేందుకు మ‌నంద‌రం కలిసి ప‌ని చేద్దాం' అని  #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

  
అల్లు అర్జున్ ప్రారంభించిన కార్య‌క్ర‌మానికి అప్పుడే స్పంద‌న వ‌స్తోంది. కొంద‌రు మొక్క‌లు నాటి #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి ట్వీట్లు చేస్తున్నారు.

Allu Arjun
tree
Telangana

More Telugu News