Venkatesh Daggubati: ఓటీటీ దిశగా కదులుతున్న 'దృశ్యం 2'

Drushyam 2 will be released in OTT
  • 'దృశ్యం 2' సీక్వెల్ పూర్తి
  • థియేటర్లకు రాలేని పరిస్థితి
  • అమెజాన్ ప్రైమ్ తో చర్చలు
మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'దృశ్యం' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను వెంకటేశ్ హీరోగా తెలుగులో శ్రీప్రియ రీమేక్ చేయగా ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. ఇక ఇటీవల మలయాళంలో వచ్చిన సీక్వెల్ కూడా ఘన విజయాన్ని అందుకుంది. అదే సీక్వెల్ ను తెలుగులో వెంకటేశ్ చేశారు. ఈ సారి జీతూ జోసెఫ్ నే తెలుగులోనూ దర్శకత్వం వహించడం విశేషం. 

ఈ సినిమా కోసమే ఇప్పుడు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. అందువలన మలయాళ 'దృశ్యం 2' సినిమా మాదిరిగానే తెలుగులోను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. డీల్ ఓకే అయితే అమెజాన్ ప్రైమ్ నుంచి పలకరిస్తుందనీ, లేదంటే నేరుగా థియేటర్లకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో చూడాలి.
Venkatesh Daggubati

More Telugu News