TS High Court: లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులను అడ్డుకోవద్దు: టీఎస్ హైకోర్టు

Dont stop lawyers says TS High Court
  • బార్ కౌన్సిల్ కార్డును చూపించే లాయర్లను అనుమతించాలి
  • వారి స్టెనోలు, క్లర్కులను కూడా అడ్డుకోవద్దు
  • తమ ఆదేశాలను ధిక్కరిస్తే తీవ్రంగా పరిగణిస్తాం
కరోనా నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని పోలీసులు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. న్యాయవాదులను ఆపకూడదని సూచించింది. బార్ కౌన్సిల్ కార్డులను చూపించే లాయర్లను అనుమతించాలని ఆదేశించింది. అంతేకాదు, న్యాయవాదులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారి స్టెనోలు, క్లర్కులను కూడా అనుమతించాలని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే న్యాయవాదులను కూడా అడ్డుకోకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

గుర్తింపు కార్డులను చూపించినా అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తమ సూచనల మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని ఆదేశించింది. ఇదే సమయంలో న్యాయవాదులు, క్లర్కులు, స్టెనోలకు కూడా సూచనలు జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది.
TS High Court
Lawyers
Lockdown

More Telugu News