COVID19: అప్పుడు కష్టపడి తండ్రిని కాపాడుకుంది.. ఇప్పుడు కోల్పోయింది!

Father Of Bihar Girl Who Cycled 1200 Km For Him During Lockdown Dies
  • 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయి తండ్రి మృతి
  • గుండెపోటుతో మరణించిన జ్యోతి నాన్న
  • గత ఏడాది లాక్ డౌన్ లో తండ్రిని తీసుకుని సైకిల్ పై పయనం
జ్యోతి గుర్తుందా? పోనీ తన తండ్రి కోసం వారం పాటు 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అమ్మాయి గుర్తుందా? అవును, ఆ 15 ఏళ్ల అమ్మాయి తన పేరుతో కంటే.. తండ్రి కోసం సైకిల్ తొక్కిన అమ్మాయిగానే చిరపరిచితం. లాక్ డౌన్ లో ఉపాధి కరవై తన తండ్రిని తీసుకుని సైకిల్ పై బీహార్ లోని తన సొంతూరికి చేరి వార్తల్లోకెక్కిన ఆ అమ్మాయి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కూ ఎంపికైంది.

అయితే, ఆ అమ్మాయి ఇంట్లో విషాదం నెలకొంది. తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపించే ఆ అమ్మాయి.. ఆ ప్రేమనే పోగొట్టుకుంది. గుండెపోటుతో ఆమె తండ్రి మరణించాడు. దీంతో ఆమె బాధ వర్ణనాతీతంగా మారింది. ఎన్నో బాధలు పడి, రెండు రోజులు తిండికి తిప్పలు పడి సొంతింటికి చేరినా.. తన తండ్రిని పోగొట్టుకుని ఇప్పుడు మరిన్ని బాధలు పడుతోంది.
COVID19
Lockdown
Jyothi
Bihar

More Telugu News