'టార్జాన్' హీరో జో లారా దుర్మరణం
- కుప్పకూలిన జో లారా ప్రయాణిస్తున్న జెట్ విమానం
- విమానంలో ఆయన భార్యతో పాటు మరో ఐదుగురు
- అందరూ మరణించినట్టు అధికారుల ప్రకటన
అయితే, విమానం ప్రమాదానికి ఎందుకు గురయిందనే విషయం మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో జో లారాతో పాటు ఆయన భార్య గువెన్ లారా, మరో ఐదుగురు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. లారా వయసు 58 ఏళ్లు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
1989లో ప్రసారమైన 'టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్' టీవీ సీరీస్ లో టార్జాన్ పాత్రను పోషించిన జో లారా తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన మృతి పట్ల హాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.