Joe Lara: 'టార్జాన్' హీరో జో లారా దుర్మరణం

Tarzam hero Joe Lara dead in flight crash
  • కుప్పకూలిన జో లారా ప్రయాణిస్తున్న జెట్ విమానం
  • విమానంలో ఆయన భార్యతో పాటు మరో ఐదుగురు
  • అందరూ మరణించినట్టు అధికారుల ప్రకటన
అమెరికన్ టీవీ సీరీస్ లో టార్జాన్ పాత్రను పోషించి పేరుతెచ్చుకున్న జో లారా తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 29న తన భార్యతో కలిసి జెట్ విమానంలో ఆయన ప్రయాణిస్తుండగా... నషవిల్లె ప్రాంతంలోని పామ్ బీచ్ సమీపంలో విమానం కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్రాంతాన్ని రాత్రంతా గాలించినప్పటికీ... ఫలితం దక్కలేదు. దీంతో, విమానంలో ఉన్నవారంతా మరణించినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు.

అయితే, విమానం ప్రమాదానికి ఎందుకు గురయిందనే విషయం మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో జో లారాతో పాటు ఆయన భార్య గువెన్ లారా, మరో ఐదుగురు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. లారా వయసు 58 ఏళ్లు. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

1989లో ప్రసారమైన 'టార్జాన్: ది ఎపిక్ అడ్వెంచర్స్' టీవీ సీరీస్ లో టార్జాన్ పాత్రను పోషించిన జో లారా తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆయన మృతి పట్ల హాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
Joe Lara
Tarzan
Dead
Hollywood

More Telugu News