Vadde Sobhanadreeswara Rao: రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్న మోదీ ప్రభుత్వానికి మద్దతా?: చంద్రబాబుపై వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం

 Vadde Sobhanadreeswara Rao Fires On Chandrababu Naidu
  • ఎన్టీఆర్ ఆత్మగౌరవ పంథాకు బాబు తిలోదకాలు ఇచ్చేశారు
  • ప్రజల ప్రాణాలను కాపాడడంలో విఫలమైన మోదీకి మద్దతా?
  • మద్దతు విషయంలో మరోమారు ఆలోచించండి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ పంథాకు మహానాడులో తిలోదకాలు ఇచ్చేసి మోదీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం శోచనీయమన్నారు.

రైతు ప్రయోజనాలను దెబ్బతీసే సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రానికి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడంలో విఫలమైన మోదీకి మద్దతు ప్రకటించడం చంద్రబాబుకు తగదన్నారు. రాష్ట్రానికి అన్యాయం తలపెడుతున్న మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో మరోమారు ఆలోచించాలని చంద్రబాబుకు వడ్డే హితవు పలికారు.

కాగా, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ జూన్ 5న వాటి ప్రతుల్ని దహనం చేయాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ కూడా అయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. భాగస్వామ్య సంఘాలన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Vadde Sobhanadreeswara Rao
Chandrababu
Narendra Modi
NTR

More Telugu News