Baba Ramdev: వెనక్కి తగ్గని రాందేవ్ బాబా.. టీకా వేసుకున్నా మరణిస్తున్నారంటూ అల్లోపతి వైద్యంపై విమర్శలు

Ramdev again questions Covid vaccines
  • అల్లోపతిపై విమర్శలతో ఐఎంఏ ఆగ్రహానికి గురైన యోగా గురు
  • తనకు టీకా వేసుకునే అవసరమే రాదని స్పష్టీకరణ
  • అల్లోపతి వైద్యం 100 శాతం పనిచేయదని వాదన
  • భవిష్యత్తులో ప్రపంచమంతా ఆయుర్వేదాన్నే అనుసరిస్తుందన్న బాబా

అల్లోపతి వైద్య విధానంపై తీవ్ర విమర్శలు చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మరోమారు అలాంటి విమర్శలే చేశారు. అల్లోపతితో పోలుస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయుర్వేద వైద్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా టీకాలు వేసుకున్నప్పటికీ కొందరు మరణిస్తున్నారని, దీనిని బట్టే మనకు అల్లోపతి వైద్యం సమర్థత ఏపాటిదో అర్థం అవుతోందని అన్నారు. ఇంగ్లిష్ వైద్యం 100 శాతం పనిచేయదనడానికి ఇది నిదర్శనమన్నారు.

తాను కొన్ని దశాబ్దాలుగా యోగాను అభ్యసిస్తున్నానని, ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్న బాబా.. తనకు టీకాలతో పనిలేదన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని విదేశీయులు కూడా అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తుందని రాందేవ్ బాబా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News