Tremors: నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భూ ప్రకంపనలు... భయాందోళనలో ప్రజలు!

Minor tremors in some parts of Nellore district
  • వరికుంటపాడు మండలంలో కంపించిన భూమి
  • 3 సెకన్ల పాటు ప్రకంపనలు
  • సమాచారం సేకరిస్తున్న అధికారులు
  • ఇళ్లలో ఉండేందుకు భయపడుతున్న స్థానికులు

నెల్లూరు జిల్లాలో ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వరికుంటపాడు మండలంలోని బోయమడుగుల, జంగంరెడ్డిపల్లి, కనియంపాడు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి వచ్చారు. మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు వెల్లడించారు.

ఎలాంటి ఆస్తినష్టం సంభవించకపోయినా, ఒక్కసారిగా భూమి అదరడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలో ఉండేందుకు వెనుకంజ వేస్తున్నారు. భూ ప్రకంపనలపై స్పందించిన అధికారులు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News