Jagan: టాప్ ట్రెండింగ్ లో సీఎం జగన్ రెండేళ్ల పాలన హ్యాష్ ట్యాగ్

CM Jagan two years administration hashtag gone viral
  • సీఎంగా జగన్ ప్రమాణస్వీకారానికి రెండేళ్లు పూర్తి
  • ట్విట్టర్ లో వైసీపీ అభిమానుల సందడి
  • '2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను' హ్యాష్ ట్యాగ్ వైరల్
  • శనివారం ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లయింది. ఈ అంశం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. '2ఇయర్స్ ఫర్ వైఎస్ జగన్ అనే నేను' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. జాతీయస్థాయిలో ఈ హ్యాష్ ట్యాగ్ నిన్న నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండింగ్ అయింది.

ఈ హ్యాష్ ట్యాగ్ రంగప్రవేశం చేసిన కొన్ని గంటల్లో లక్షల్లో ట్వీట్లు వచ్చాయి. గత సంవత్సరం సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన హ్యాష్ ట్యాగ్ ను 20 లక్షల మంది ట్వీట్ చేశారు. తాజా హ్యాష్ ట్యాగ్ కూడా అదే రీతిలో దూసుకుపోతోంది.
Jagan
2YearsForYSJaganAneNenu
Hashtag
YSRCP
Andhra Pradesh

More Telugu News