Australia: ఆస్ట్రేలియా ఎలుకలకు భారత్ మందు!

Australia seeks rat killing poison from India
  • ఆస్ట్రేలియాలో విపరీతంగా పెరిగిపోయిన ఎలుకల సంఖ్య
  • తీవ్ర నష్టం కలుగజేస్తున్న మూషిక జాతి
  • నిర్మూలించేందుకు ప్రభుత్వ చర్యలు
  • భారత్ నుంచి బ్రోమాడియోలోన్ కొనుగోలుకు ఆర్డర్
పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పుడు ఓ కొత్త సమస్యతో సతమతమవుతోంది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన మూషిక సంతతి అక్కడ ప్రజాజీవనానికి భంగం కలిగే స్థాయిలో విజృంభిస్తోంది. పంటపొలాలు, నివాస గృహాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు... ఇలా ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం భారత్ వైపు చూస్తోంది.

ఎలుకల నివారణలో ఉపయోగించే బ్రోమాడియోలోన్ విష పదార్థం కొనుగోలుకు ఆర్డర్ బుక్ చేసింది. భారత్ నుంచి 5,000 లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేసి ఎలుకల అంతు తేల్చాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం ఈ ఎలుకల నివారణ ఔషధం కోసం రూ.3,600 కోట్ల నిధులు కేటాయించింది.

ఇక్కడి సమాఖ్య ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఎలుకల సంహారం మొదలుపెట్టనున్నారు. కార్చిచ్చు, వరదల వంటి విపత్తులతో ఇప్పటికే నష్టపోయిన ఆస్ట్రేలియాను ఇప్పుడీ ఎలుకల బెడద మరింత వేధిస్తోంది.
Australia
Mice
Rat Kill
India
New South Wales

More Telugu News