Sonu Sood: వెబ్‌సైట్ ద్వారా అడిగిన వారికి ఆక్సిజన్‌ సిలిండర్లు పంప‌డానికి సోనూసూద్ సిద్ధం

sonu sood ready to send oxygen cylinders
  • ఇప్ప‌టికే ఆక్సిజన్‌ ప్లాంట్స్ సిద్ధం
  • దేశ వ్యాప్తంగా సేవ‌లు
  • www.umeedysonusood.com లో బుక్ చేసుకుంటే చాలు
క‌రోనా విజృంభ‌ణ వేళ ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తోన్న సినీన‌టుడు సోనూసూద్ ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ను కూడా నిర్మించిన విష‌యం తెలిసిందే. ఆక్సిజన్‌ అవసరం ఉన్న వారికి దేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేసేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. డీటీడీసీ కొరియ‌ర్ ద్వారా సిలిండర్లు సరఫరా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆక్సిజ‌న్ అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్‌ అయి వివ‌రాలు తెల‌పాల‌ని ఆయ‌న వివ‌రించారు. వాటిని ప‌రిశీలించి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల‌ను ఉచితంగా పంపిస్తాన‌ని సోనూసూద్ చెప్పారు. దేశంలో ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా సిలిండర్ ను ఉచితంగా పంపేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sonu Sood
Corona Virus
COVID19

More Telugu News