Amitabh Bachchan: సన్నీ లియోన్ ఇంటి పక్కన డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేసిన అమితాబ్!

Amitabh purchased new duplex house in Mumbai
  • రూ. 31 కోట్లతో కొనుగోలు చేసిన అమితాబ్
  • ఇంటి విస్తీర్ణం 5,184 చదరపు అడుగులు
  • ఇదే భవనంలో ఇంటిని కొన్న సన్నీ లియోన్
భారత సినీ పరిశ్రమ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి ఆరు కార్ పార్కింగ్ లు ఉన్నాయి. గత డిసెంబర్ లో ఈ ఇంటిని కొన్నప్పటికీ... ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది.

ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది.

మరోవైపు, అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 13 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు ఇమ్రాన్ హష్మి, రణబీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి నటించిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Amitabh Bachchan
Sunny Leone
Duplex House
Mumbai
Bollywood

More Telugu News