Vijayawada: గుంటూరు, విజయవాడలో రూ. 100 దాటిన లీటర్ పెట్రోల్ ధర

Petrol rate in Vijayawada and Guntur crosses RS 100
  • గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.15
  • విజయవాడలో రూ. 100.11
  • హైదరాబాదులో రూ. 97.63  
ఇటీవల మన దేశంలోని పలు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా 15వ రోజు వీటి ధరలు పెరిగాయి. ఈ 15 రోజుల కాలంలో పెట్రోల్ రూ. 3.54, డీజీల్ 4.16 చొప్పున పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో విజయవాడ, గుంటూరుల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. గుంటూరులో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 100.15... డీజిల్ ధర రూ. 94.44గా ఉంది. ప్రీమియం పెట్రోల్ ధర రూ. 103.58కి చేరింది.

మరోవైపు విజయవాడలో పెట్రోల్ ధర రూ. 100.11... డీజిల్ ధర రూ. 94.54గా ఉంది. హైదరాబాదులో పెట్రోల్ ధర రూ. 97.63... డీజిల్ ధర రూ. 92.54కి చేరుకుంది.

ముంబైలో కూడా పెట్రోల్ ధర శతకాన్ని దాటేసింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 100.19, డీజిల్ ధర రూ. 92.17కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ. 95.51... డీజిల్ రూ. 89.65గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 97.07... డీజిల్ ధర రూ. 89.99కి చేరుకుంది. కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 93.97... డీజిల్ రూ. 89.99గా ఉంది.
Vijayawada
Guntur
Petrol
Deisel
Rate

More Telugu News