Corona Virus: కొవిడ్ బారినపడిన మాజీ సీఎస్ ఎస్‌వీ ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమం

Health of  former CS SV Prasad family infected to corona
  • యశోద ఆసుపత్రిలో ఎస్‌వీ ప్రసాద్ కుటుంబం
  • కోలుకుంటున్న చిన్న కుమారుడు
  • ఐసీయూలో పెద్ద కుమారుడు
కొవిడ్ బారినపడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఎస్‌వీ ప్రసాద్ దంపతుల ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్‌లో నివసిస్తున్న వీరి కుటుంబం మొత్తం ఇటీవల కరోనా బారినపడింది. ప్రసాద్ పెద్ద కుమారుడు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుండగా, చిన్న కుమారుడు కోలుకుంటున్నాడు.

ప్రసాద్ దంపతులు ఇటీవల కరోనా బారినపడి యశోద ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన ప్రసాద్ ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ప్రత్యేక కార్యదర్శిగాను, విజిలెన్స్ కమిషనర్‌గాను పనిచేశారు.
Corona Virus
SV Prasad
Andhra Pradesh
Telangana

More Telugu News