G Jagadish Reddy: దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోతోంది... బీజేపీని నమ్ముకున్న వాళ్లకు ఒరిగేదేమీ లేదు: మంత్రి జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddy comments on Eatala and BJP
  • ఈటల బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు
  • స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి
  • ఈటలకు ప్రయోజనం ఉండదని వెల్లడి
  • ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సహజమని వ్యాఖ్యలు
ఇటీవల మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈటల బీజేపీలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పడిపోవడం వల్ల బీజేపీని నమ్ముకున్నవాళ్లకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నారు.

రాజకీయ పార్టీల్లో అనుకున్న స్థానం దక్కని వాళ్లు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లడం సహజమని జగదీశ్ రెడ్డి వివరించారు. తెలంగాణలో బీజేపీకి ప్రాబల్యం ఉండదని తాను ముందే చెప్పానని స్పష్టం చేశారు. తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు.
G Jagadish Reddy
Eatala Rajender
BJP
Narendra Modi
India

More Telugu News