Supreme Court: ఓటుకు నోటు కేసు: తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notices to Telangana ACB
  • క్రాస్ ఎగ్జామినేషన్ పై సుప్రీంను ఆశ్రయించిన రేవంత్ రెడ్డి
  • విచారణ పూర్తయ్యేవరకు క్రాస్ ఎగ్జామినేషన్ వద్దన్న సుప్రీం
  • 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఏసీబీకి ఆదేశం
  • అప్పటివరకు తదుపరి విచారణ వాయిదా
ఓటుకు నోటు కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. ఆ విషయం అటుంచితే... ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట కలిగిస్తూ ద్విసభ్య ధర్మాసనం (జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత) కీలక ఆదేశాలు వెలువరించింది.

 ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ జరపరాదని తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. అప్పటివరకు తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేలా ప్రలోభాలకు గురిచేశాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ అభియోగాలు మోపడం తెలిపిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్ద డబ్బు సంచులతో రేవంత్ రెడ్డి ఉన్న వీడియోలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
Supreme Court
Telangana ACB
Notice
Revanth Reddy

More Telugu News