Shankar: చరణ్ ప్రాజెక్టు విషయంలో స్పీడు మీదున్న శంకర్!

Shankar movie pre prodution works completed
  • చరణ్ తో శంకర్ మూవీ
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి
  • కొన్ని లొకేషన్స్ అనుకున్న శంకర్
  • త్వరలో అందుకు సంబంధించిన పనులు  
దక్షిణాది సినిమాకు భారీతనాన్ని తీసుకొచ్చిందీ .. ప్రపంచపటానికి పరిచయం చేసింది శంకర్. కథాకథనాలపై ఆయనకి ఎంత పట్టు ఉంటుందో, సాంకేతికతపై కూడా ఆయనకి అంతే అవగాహన ఉండటం విశేషం. ఇక శంకర్ సినిమాల్లో సంగీతానికీ .. పాటలకు మాత్రమే కాదు, లొకేషన్స్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దృశ్యానికి ప్రత్యేకమైన ఆకర్షణ తీసుకొచ్చేది లొకేషన్స్ అని ఆయన భావిస్తుంటాడు. అందువలన ఎక్కడెక్కడికో లొకేషన్స్ కి వెళ్లడానికే అయన సినిమాలకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతూ ఉంటుంది.

ఇక ఆయన తాజా చిత్రం చరణ్ తో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు మొదలవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆల్రెడీ శంకర్ ఆ పనులను పూర్తి చేశాడట. కథాపరంగా ఆయన కొన్ని లొకేషన్స్ ను అనుకున్నాడట. కరోనా ప్రభావం తగ్గగానే వెళ్లి చూసి ఫిక్స్ చేయనున్నాడని అంటున్నారు. 'రోబో' సెకండ్ పార్ట్ విషయంలో అసంతృప్తి .. 'ఇండియన్ 2' విషయంలో అసహనం కారణంగా, ఈ సినిమా విషయంలో శంకర్ స్పీడ్ మీదే ఉన్నాడనిపిస్తోంది.
Shankar
Charan
Dil Raju

More Telugu News