Indian Grey Hornbill: నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి

indian grey hornbill caught on camera in nallamala forest
  • నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన పక్షి
  • భారత ఉపఖండంలో మాత్రమే కనిపించే ఇండియన్ గ్రేహార్న్
  • ఫారెస్ట్ ఇంజినీర్స్ అని కూడా పేరు
అడవి రైతుగా పిలిచే అరుదైన ఇండియన్ గ్రేహార్న్ బిల్ పక్షి నల్లమల అటవీ ప్రాంతంలో సందడి చేసింది. నిజానికి ఇవి భారత ఉప ఖండంలో మాత్రమే కనిపిస్తాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో నిన్న ఇది అటవీశాఖ కెమెరాకు చిక్కింది.

ఈ పక్షికి 50 సెంటీమీటర్ల పొడవైన ముక్కు, పొడవైన తోక వుంటాయని నాగార్జునసాగర్ డివిజన్ అటవీ అధికారి సర్వేశ్వరరావు, చందంపేట అటవీ అధికారి రాజేందర్ మీడియాకు తెలిపారు. నలుపు, తెలుపు, బూడిద రంగు కలబోతతో ఉండే ఈ గ్రేహార్న్ బిల్ ఎత్తైన చెట్లపైన, అడవిలోని కొండలు, గుట్టలపైనే సంచరిస్తుందని చెప్పారు. అత్తిపండ్లు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. ఈ పక్షిని అడవి రైతు, ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు.
Indian Grey Hornbill
Nalgonda District
Nallamala Forest

More Telugu News