Nagarjuna: 'బంగార్రాజు'లో చైతూ జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్?

Priyanka Arul Mohan role in Bangaarraju
  • 'నానీస్ గ్యాంగ్ లీడర్'తో ఎంట్రీ
  • నిరాశపరిచిన 'శ్రీకారం'
  • తమిళంలో వరుస అవకాశాలు
  • 'బంగార్రాజు' కోసం వినిపిస్తున్న పేరు
తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన నాజూకైన కథానాయికలలో 'ప్రియాంక అరుళ్ మోహన్' ఒకరు. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా పరిచయమైన ఈ అమ్మాయి, గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత ఇటీవల శర్వానంద్ సరసన 'శ్రీకారం' సినిమాలో ఆడిపాడింది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ప్రియాంక చక్కదనానికి అంతా ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయి చైతూ జోడీగా 'బంగార్రాజు' సినిమాలో కనిపించనుందనే టాక్ ఒకటి బలంగా వినిపిస్తోంది.

నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందనుంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుంది. ఇక చైతూ జోడీగా సమంత పేరు వినిపించింది. కానీ ఈ సినిమాలో సమంత నటించడం లేదట. ఆ పాత్ర కోసం ప్రియాంక అరుళ్ మోహన్ ను సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 'బంగార్రాజు' సినిమా కోసం ఆమెను సంప్రదించడమనేది ఎంతవరకూ వాస్తవమో చూడాలి.
Nagarjuna
Ramya Krishna
Chaitu
Priyanka

More Telugu News