Revanth Reddy: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట

Chandrababu gets relief in note for vote case
  • రేవంతర్ రెడ్డిపై ఛార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ
  • మనీ లాండరింగ్ కేసు నమోదు
  • నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చని ఈడీ
ఓటుకు నోటు కేసు ఇరు తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే)పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే, ఈ ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, నిందితుడిగా మాత్రం ఈడీ ఆయనను పేర్కొనలేదు. దీంతో, చంద్రబాబుకు ఊరట లభించినట్టయింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు తెలంగాణ ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మండలి ఎన్నికల సందర్భంగా, నామినేటెడ్ ఎమ్మెల్యే  స్టీఫెన్ సన్ తో రేవంత్ రాయబారాలు నడిపినట్టుగా ఏసీబీ పేర్కొంది. స్టీఫెన్ సన్ ను డబ్బుతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినట్టు రేవంత్ పై ఆరోపణలు చేసింది.

ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుతో రేవంత్, స్టీఫెన్ సన్ సంభాషించినట్టు కాల్ రికార్డులు బయటకు వచ్చిన సంగతి విదితమే. 
Revanth Reddy
Congress
Enforcement Directorate
Chandrababu
Telugudesam

More Telugu News