Raghu Rama Krishna Raju: కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: రఘురామకృష్ణరాజు

Thankful to all who stood by me in difficult time says Raghu Rama Krishna Raju
  • ఉదయం ఆసుపత్రి నుంచి ఢిల్లీకి పయనం 
  • ఢిల్లీ నుంచి ట్విట్టర్ ద్వారా స్పందించిన రఘురాజు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాదు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ఈ కష్ట సమయంలో తనకు తోడుగా, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ఈ నెల 14న రఘురాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సమాజంలో విభేదాలు రేకెత్తించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారంటూ ఆయనపై దేశద్రోహం కేసును పెట్టారు. మరోవైపు రఘురాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
Raghu Rama Krishna Raju
YSRCP

More Telugu News