Vijayasai Reddy: మాఫియాలన్నిటికీ బాసువి నువ్వే కదా బాబూ!: విజయసాయిరెడ్డి

Chandrababu is boss of all mafia says Vijayasai Reddy
  • ఆనందయ్యను కూడా వదలడం లేదు
  • శవాలపై పేలాలు ఏరుకునే బాబు గుడ్డ కాల్చి మీదేశారు   
  • మందును పరీక్షల కోసం ప్రభుత్వం పంపించింది
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. దివాళాకోరు బాబు చివరకు ఆనందయ్యను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. ఆనందయ్య మందును పరీక్షల కోసం ప్రభుత్వం పంపించిందని చెప్పారు. ఫలితాలు రాగానే మందు పంపిణీ మొదలవుతుందని అన్నారు. డ్రగ్ మాఫియా కోసమే ఆనందయ్య మందును ఆపేశారంటూ శవాలపై పేలాలు ఏరుకునే బాబు గుడ్డ కాల్చి మీదేశారని చెప్పారు. మాఫియాలన్నిటికీ బాసువి నువ్వే కదా బాబూ అని వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గర్భిణుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విజయసాయి అన్నారు. ప్రసవాల విషయంలో ప్రత్యేక చర్యలను చేపట్టిందని తెలిపారు. కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేక వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిందని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News