KCR: జూనియర్ డాక్టర్లపై కేసీఆర్‌ ఆగ్రహం

KCR anger on Junior Doctors
  • కరోనా సమయంలో సమ్మెకు దిగడం సరికాదు
  • ఇలాంటి సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యతను ఇవ్వాలి
  • జూడాల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తాం
ఆకస్మిక సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో సమ్మెకు దిగడం సరికాదని అన్నారు. ఇలాంటి కీలక సమయాల్లో ప్రజల ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు.

జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని ఆయన నిర్ణయించారు. అంతేకాదు, కరోనా సేవల్లో ఉన్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనమే ఇవ్వాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ స్టయిఫండ్ ను తెలంగాణ జూడాలకు ఇస్తామని తెలిపారు. కరోనా సమయంలో సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరికాదని అన్నారు.
KCR
TRS
JUDA

More Telugu News