aiims: ఢిల్లీలో తన నివాసానికి చేరుకున్న రఘురామకృష్ణరాజు 

 raghurama reaches aiims
  • సికింద్రాబాద్‌ ఆర్మీ  ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ 
  • నేరుగా ఢిల్లీకి ర‌ఘురామ‌
  • కొన్ని రోజుల పాటు మెరుగైన చికిత్స
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ  ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్  అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న సరాసరి ఎయిమ్స్ కు వెళ్లారు. అక్క‌డ మెరుగైన వైద్య చికిత్స తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం బెడ్స్ ఖాళీ లేవని, గురువారం నాటికి ఏర్పాటు చేస్తామని ఎయిమ్స్ అధికారులు తెలపడంతో, ఆయన తన నివాసానికి చేరుకున్నారు.

కాగా, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోష‌ల్ మీడియాలో గానీ మాట్లాడ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ష‌ర‌తు విధించింది.
aiims
New Delhi
Raghu Rama Krishna Raju

More Telugu News