Corona Virus: సమీపంలో ఉన్న వారికి గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది: కేంద్ర ప్రభుత్వం

Corona Virus spreads through air says Center
  • తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి
  • తుంపర్లు కళ్లలో, నోటిలో లేదా ముక్కులో పడిన వారికి కూడా వైరస్ సోకే అవకాశం
  • గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా వైరస్ సోకే అవకాశం
గాలి ద్వారానే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకు వచ్చే తుంపర్ల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం విడుదల చేసిన మార్గదర్శకాల్లో కూడా కరోనా గాలి ద్వారా దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.

కరోనా వైరస్ తో కూడిన నీటి తుంపర్లను లేదా గాలి తుంపర్లను పీల్చిన వారికి వైరస్ సోకుతోందని తెలిపింది. అంతేకాదు, ఆ తుంపర్లు కళ్లలో, నోటిలో లేదా ముక్కులో పడిన వారికి కూడా వైరస్ సోకుతుందని చెప్పింది. గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండేవారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని తెలిపింది. వెలుతురు, గాలి ప్రసరించని గదుల్లో ఎక్కువ మంది ఎక్కువ సేపు గడిపితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుందని తెలిపింది.
Corona Virus
Air

More Telugu News