Raghu Rama Krishna Raju: ఆసుప‌త్రి నుంచి ర‌ఘురామ‌కృష్ణరాజు డిశ్చార్జ్‌.. వెంట‌నే ఢిల్లీకి పయనం

raghurama discharges from hospital
  • సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్
  • ఢిల్లీలో మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న ఎంపీ
  • ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ర‌ఘురామ‌
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు ఇటీవ‌ల‌ ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ  ఆసుప‌త్రి నుంచి ఆయ‌న డిశ్చార్చ్ అయ్యారు. ఆ త‌ర్వాత వెంట‌నే బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీకి బ‌య‌లుదేరారు.

ఢిల్లీలో ఆయ‌న‌ మెరుగైన వైద్య చికిత్స తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.  కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కొన్ని రోజుల క్రితం రఘురామపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విష‌యం తెలిసిందే.

చివ‌ర‌కు సుప్రీంకోర్టు ఆదేశాలతో  సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రిలో ఆయ‌న‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో ఆయ‌న విడుద‌ల‌కు కావాల్సిన ప్ర‌క్రియ అంతా ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు పూర్తి చేశారు. ర‌ఘురామ కాళ్ల‌నొప్పితో పాటు ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh
Hyderabad

More Telugu News