Coramandal Fertilizers: తెలంగాణ సీఎం సహాయనిధికి కోరమాండల్ సంస్థ రూ.1 కోటి విరాళం

Coramandal Fertilizers donates one crore to Telangana CM Relief Fund
  • కరోనా నియంత్రణకు తీవ్రంగా శ్రమిస్తున్న తెలంగాణ
  • ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరమాండల్ ఫర్టిలైజర్స్ నిర్ణయం
  • భారీ విరాళం ప్రకటించిన వైనం
  • ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ కు చెక్ అందజేత

కరోనాపై పోరాడుతున్న తెలంగాణకు సాయంగా నిలిచేందుకు కోరమాండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ముందుకొచ్చింది. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది.

కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ఇవాళ హైదరాబాదు ప్రగతి భనవ్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తమ విరాళం తాలూకు చెక్ ను సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని అభినందించారు.

  • Loading...

More Telugu News