ఎర్రచందనం కేసులో 'జబర్దస్త్' నటుడు!
- నటుడు హరి స్మగ్లింగ్ కేసులో బుక్
- గతంలో కూడా హరిపై కేసులు
- స్మగ్లర్ల నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులు కూంబింగ్ చేస్తున్న సమయంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ. 3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ స్మగ్లింగ్ గ్యాంగుతో హరికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెపుతున్నారు. గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ అంశంపై హరి స్పందించాడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తుంటే.. తాను పోలీసులకు సమాచారం అందించానని... ఆ కోపంతో అతను తనపై తప్పుడు కేసులు పెట్టాడని మండిపడ్డాడు.