కరోనా కట్టడికి కొత్త ఔషధం... ధర రూ.59 వేలు
- భారత మార్కెట్లోకి యాంటీబాడీ కాక్ టెయిల్
- ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల మిశ్రమం
- రూపొందించిన రోచ్ ఇండియా, సిప్లా
- ఒక్క ప్యాక్ ఇద్దరికి సరిపోతుందన్న ఫార్మా సంస్థలు
ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి. ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికనే ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్ ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్ ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు పేర్కొన్నారు.
దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.