Madurai Couple: చార్టర్డ్ విమానంలో పెళ్లి... కరోనా మార్గదర్శకాలకు తిలోదకాలు!

 Madurai couple weds in mid air
  • వినూత్నంగా విమానంలో పెళ్లి 
  • మధురై నుంచి బెంగళూరు వెళుతూ మాంగల్యధారణ
  • అతిథులతో క్రిక్కిరిసిన స్పైస్ జెట్ విమానం
  • మాస్కుల్లేకుండానే కనిపించిన జనాలు
  • విచారణకు ఆదేశించిన డీజీసీఏ
తమిళనాడులోని మధురైకి చెందిన ఓ జంట తమ పెళ్లిని వినూత్నంగా విమానంలో జరుపుకుంది. తమ పెళ్లిని చిరస్మరణీయంగా చేసుకునేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఏర్పాటు చేశారు. ఈ వివాహం కోసం ఏకంగా ఓ విమానాన్నే అద్దెకు తీసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ విమానంలో మధురై నుంచి బెంగళూరు వెళుతూ గాల్లోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ విమానం స్పైస్ జెట్ సంస్థకు చెందినది.

అయితే, కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.
Madurai Couple
Spice Jet
Bengaluru
Corona Protocal
DGCA

More Telugu News