Chiranjeevi: 'ఆచార్య'లో చరణ్ పాత్రపై కొరటాల క్లారిటీ!

Charan playing a lead role in Acharya second half
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • సిద్ధా రోల్ చాలా పవర్ఫుల్
  • అది గెస్టు రోల్ కాదన్న కొరటాల
చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఓ పది రోజుల పాటు చిత్రీకరణ జరిపితే, ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే జోడీగా కనిపించనున్నారు. ఈ సినిమాలో 'సిద్ధా' అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడని అన్నారు. అయితే ఈ పాత్ర నిడివి అరగంటలోపే ఉంటుందనీ, ఆ సమయంలోనే రెండు పాటలు ఉంటాయనే టాక్ వినిపించింది. దాంతో చరణ్ చేస్తున్నది జస్ట్ గెస్టు రోల్ అనే టాక్ వచ్చింది.

అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ .. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్టు రోల్ కాదు. ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కథలోని కీలకమైన సన్నివేశాలన్నీ కూడా ఆయన పాత్రతో ముడిపడే నడుస్తాయి. సెకండాఫ్ అంతా కూడా చరణ్ పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో చిరంజీవి - చరణ్ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఆశయం పరంగానే వాళ్ల మధ్య అనుబంధం ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.
Chiranjeevi
Kajal Agarwal
Charan
Pooja Hegde

More Telugu News