CPI Narayana: ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైంది: సీపీఐ నారాయణ

CPI Narayana visits Krishnapatnam
  • తీవ్ర చర్చనీయాంశంగా ఆనందయ్య మందు
  • కృష్ణపట్నంలో పర్యటించిన నారాయణ
  • మందు పంపిణీ కేంద్రం పరిశీలన
  • సైడ్ ఎఫెక్ట్స్ లేవని వ్యాఖ్యలు
  • ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని సూచన
ఏపీలో ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య మందు పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీసిన నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య కరోనా మందు తీసుకున్నవారిలో ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదని అభిప్రాయపడ్డారు.

కానీ ఆనందయ్య మందుపై కార్పొరేట్ ఆసుపత్రుల గోల ఎక్కువైందని అన్నారు. ఇలాంటి మందులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. కోటయ్య స్టెరాయిడ్స్ వాడడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని పేర్కొన్నారు. ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తెలిసిందని అన్నారు.
CPI Narayana
Krishnapatnam
Anandaiah Medicine
Corona Virus
Nellore District
Andhra Pradesh

More Telugu News