Gorantla Butchaiah Chowdary: కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం తొందరగా ప్రకటన చేయాలి: గోరంట్ల‌

give statement about krishnapatnam medicine gorantla
  • ఏ మందుకైనా విశ్వసనీయత ముఖ్యం
  • అదే ప్రాణాన్ని నిలుపుతుంది
  • ప్ర‌భుత్వం ఇందులో లాభాపేక్ష చూడకూడ‌దు
  • ప్రజలకి ఉపయోగకరం అయితే అందుబాటులోకి తేవాలి
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న నాటు మందు కరోనాను అంతం చేస్తుంద‌న్న ప్రచారంతో ఏపీతోపాటు ప‌లు రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా తరలివచ్చిన విష‌యం తెలిసిందే. ఆ మందును భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి కూడా ప‌రిశీలిస్తోంది. ఆ మందుపై  ప్ర‌భుత్వం త్వ‌ర‌గా ప్ర‌క‌ట‌న చేయాల‌ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి డిమాండ్ చేశారు.

'కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం తొందరగా ప్రకటన చేయాలి. ఏ మందుకైనా విశ్వసనీయత ముఖ్యం. అదే ప్రాణాన్ని నిలుపుతుంది. ప్ర‌భుత్వం ఇందులో లాభాపేక్ష చూడకుండా వాస్తవ విధానాన్ని పరిశీలించి, ప్రజలకి ఉపయోగకరం అయితే అందుబాటులోకి తేవాలి. విచారణ వేగవంతం చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి' అని గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి డిమాండ్ చేశారు.
 


Gorantla Butchaiah Chowdary
Telugudesam
Nellore District

More Telugu News