Shreya Ghoshal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్

Shreya Ghoshal blessed with a baby boy
  • ఈ మధ్యాహ్నం శ్రేయాకు పుత్రోదయం
  • ఇన్ స్టాలో వెల్లడించిన శ్రేయా
  • ఉద్వేగంగా ఉందని వెల్లడి
  • 2015లో పెళ్లి చేసుకున్న గాయని
  • బాల్య స్నేహితుడితో వివాహం
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ కు పుత్రోదయం అయింది. ఆమె ఇవాళ మధ్యాహ్నం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

"దేవుడు మమ్మల్ని ఓ మగబిడ్డతో దీవించాడు. ఇలాంటి ఉద్వేగాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు. శిలాదిత్య, నేను, ఇతర కుటుంబ సభ్యులు ఈ మధుర క్షణాల్లో ఉప్పొంగిపోతున్నాం. అభిమానుల అశేష దీవెనలకు కృతజ్ఞతలు" అంటూ శ్రేయా తన పోస్టులో స్పందించారు. శ్రేయాకు భారత సినీ సంగీత ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ మేటి గాయనిగా పేరుతెచ్చుకున్న శ్రేయా ఘోషల్ 2015లో తన బాల్య స్నేహితుడు శిలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడారు.
Shreya Ghoshal
Baby Boy
Singer
Shiladithya

More Telugu News